లాక్ డౌన్ కారణంగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ప్రభుత్వ సూచనల ప్రకారం నడుస్తున్నాయి. ఇక రోడ్డెక్కాల్సింది సిటీ బస్సులే. హైదరాబాద్ మహానగరంలో సిటీ బస్సులు నడవకపోవడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సిటీ బస్సులను కూడా నడిపించేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తుంది.
సిటీ బస్సులను నడపాలని ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. జూన్ 8 వ తేదీ నుంచి మరికొన్ని సర్వీసులకు అనుమతులు ఇస్తున్నారు. దీంతో జూన్ 8 వ తేదీ నుంచి సిటీ బస్సులు తిరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ అధికారులతో చర్చిస్తున్నారు.