బాలయ్య కు తేజ్ సపోర్ట్

రెండు నెలలుగా సినిమా షూటింగ్ , థియేటర్స్ బంద్ కావడం తో నిర్మాతలు , కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్ లకు అనుమతి ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి షూటింగ్ ఆకూ అనుమతి కోరడం జరిగింది. అయితే ఈ విషయం తనకు తెలియదని చెప్పి పెద్ద షాకే ఇచ్చాడు బాలకృష్ణ. ప్రస్తుతం బాలయ్య కామెంట్స్ చిత్రసీమలో హాట్ టాపిక్ అయ్యాయి. కొంతమంది బాలయ్య ను విమర్శిస్తే..మరికొంతమంది సపోర్ట్ చేస్తున్నారు.

తాజాగా డైరెక్టర్ తేజ ఈ వ్యవహారం ఫై స్పదించారు. నేను సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్ని కాదు కాబట్టి నన్ను పిలువలేదు, పర్సనల్ మీటింగ్‌ అయితే ఎవరినీ పిలవాల్సిన అవసరం లేదు కానీ అది ఇండస్ట్రీ కి సంబందించిన విషయం కాబట్టి అందరినీ సంప్రదించి తీసుకుంటేనే కరెక్ట్ అని కామెంట్ చేశాడు. టాప్‌ డైరెక్టర్లు వస్తుంటారు పోతుంటారు. ఇండస్ట్రీ ఎప్పటికీ అలాగే ఉంటుంది. నేను ఇండస్ట్రీని నడిపిస్తున్నాను అనుకోవడం అవివేకం అంటూ షాకింగ్ కామెంట్లు చేసాడు.