కామ్నా ..ఇప్పుడు ఎలా ఉందొ చూస్తారా..?

ప్రేమికులు మూవీ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కామ్నా జెఠ్మలానీ ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత కొత్త హీరోయిన్స్ రాక తో అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి..తెలుగు లో ఆమె చివరి చిత్రం నాగార్జున తో భాయ్ చిత్రం చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. పెళ్లి తర్వాత మీడియా లో కనిపించని ఈ భామ..తాజాగా పిల్లలతో దర్శనం ఇచ్చింది.

ప్రస్తుతం ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్న ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలలో భర్త సూరజ్ తో పాటు పిల్లలు కూడా ఉన్నారు. మొత్తానికి కామ్నా ఓ మంచి భార్యగా గృహిణిగా సెటిల్ అయినట్లు ఫోటోలు చూస్తే అర్ధమవుతుంది