ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. లాక్డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైన నేపథ్యంలో ఆయా అంశాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, పోలవరం నిధుల గురించి కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో చర్చించాలని సీఎం వైఎస్ జగన్ భావించారు.
ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం దిల్లీ చేరుకుని 3గంటలకు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో, సాయంత్రం 4.45కి గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో, రాత్రి 10 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించాల్సి ఉంది. అయితే, కరోనా లాక్డౌన్ సడలింపుల పరిణామాలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిజీగా ఉండటంతో సీఎం పర్యటన వాయిదా వేసుకున్నట్టు సమాచారం.