గత రెండు నెలలుగా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. షూటింగ్ లు ఆగిపోవడం , సినిమా థియేటర్స్ మూతపడడం జరిగేసరికి నిర్మాతలు , సినీ కార్ముఖులు తీవ్ర నష్టాలూ ఎదురుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దర్శకులు, నిర్మాతలు సినిమాల షూటింగ్స్‌కు అనుమతులు ఇవ్వాలని రెండు తెలుగు ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారు.
జూన్ నెలలోనే షూటింగ్స్‌కు అనుమతులు రావచ్చునని వార్తలు వినపడుతున్నాయి. షూటింగ్స్ జరపడానికి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సెట్స్ పైకి వెళతుందని వార్తలు వినపడుతున్నాయి. ప్రభుత్వం అధికారిక ప్రకటన రాగానే షూటింగ్ స్టార్ట్ చేసేలా రాజమౌళి టీం సిద్ధంగా ఉన్నారట.