రెండు నెలలుగా సినిమా షూటింగ్ , థియేటర్స్ బంద్ కావడం తో నిర్మాతలు , కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్ లకు అనుమతి ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి షూటింగ్ ఆకూ అనుమతి కోరడం జరిగింది. అయితే ఈ విషయం తనకు తెలియదని చెప్పి పెద్ద షాకే ఇచ్చాడు బాలకృష్ణ.
బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్ అయ్యారు. బాలయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని నాగబాబు వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది. నాగబాబు వ్యాఖ్యలపై తాజాగా ఓ ఇంటర్వ్యూ లో బాలయ్య స్పందించారు. ఇంటర్వ్యూలో నాగబాబు వ్యాఖ్యలపై మీరేమంటారు? అని ప్రశ్నించగా “ఛీ, ఛీ… నేనేమంటాను, అన్నీ ఆయనే మాట్లాడుతున్నాడు కదా. నేను అస్సలు స్పందించను. ఇవాళ ఇండస్ట్రీ మొత్తం నాకు సపోర్ట్ గా నిలుస్తోంది. అలాంటప్పుడు నేనెందుకు మాట్లాడాలి?” అంటూ బాలకృష్ణ సమాధానమిచ్చాడు.