తమిళ స్టార్‌, మలయాళం స్టార్‌ తెలుగు మల్టీస్టారర్‌

విజయ్‌ సేతుపతి వరుసగా తెలుగు సినిమాలు చేస్తున్నాడు. సైరా చిత్రంలో నటించి మెప్పించిన విజయ్‌ సేతుపతి ప్రస్తుతం ఉప్పెన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఆ సినిమా విడుదలైతే తెలుగు ప్రేక్షకుల్లో ఈయన క్రేజ్‌ మరింతగా పెరగడం ఖాయం. ఇక ఇదే సమయంలో మలయాళ స్టార్‌ హీరో ఫాహద్‌ ఫాజిల్‌ కూడా తెలుగులో ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాడు. ఒక మంచి కథతో తెలుగులో ఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతున్న ఫాహద్‌ ఫాజిల్‌ ను తెలుగులో తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వర్ధమాన దర్శకుడు రాజు కనుకుల వీరిద్దరి కాంబోను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఈ దర్శకుడు చెప్పిన కథకు ఇద్దరు హీరోలు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో త్వరలోనే మల్టీస్టారర్‌ చిత్రం సెట్‌ అవ్వబోతుంది. రెండు నెలల కాలంలో వీరిద్దరు హీరోలకు సెట్‌ అయ్యే మల్టీస్టారర్‌ స్టోరీని దర్శకుడు రాజు కనుకుల రూపొందించాడట. మంచి కథ కోసం ఎదురు చూస్తున్న వీరిద్దరు హీరోలు వెంటనే ఓకే చెప్పడం జరిగింది. ఈ లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన వెంటనే పరిస్థితులు కంట్రోల్‌లోకి వచ్చిన తర్వాత సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

వీరిద్దరు హీరోలు కూడా తెలుగులో ఖచ్చితంగా సక్సెస్‌తో హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం ఖాయం అనిపిస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో నమ్మకం వ్యక్తం అవుతోంది. సినిమా షూటింగ్‌ ప్రారంభంకు ముందే ఈ సినిమా గురించి చర్చ మొదలైంది అంటే సినిమా విడుదల సమయంలో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.