గత కొన్ని రోజులుగా డైరెక్టర్ విఘ్నేష్ శివన్, నటి నయనతార మధ్య ప్రేమాయణం కొనసాగుతుందనే వార్త మీడియా లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసందే..ఎప్పటికప్పుడు మీడియా కంటపడుతున్న కానీ తమ ప్రేమ విషయాన్నీ మాత్రం చెప్పకుండా దాటవేస్తుంటారు. ఇక వీరి పెళ్లి కోసం అభిమానులు , సినీ ప్రేక్షకులే కాదు సినీ ఇండస్ట్రీ సైతం ఆసక్తి గా ఎదురుచూస్తుంది.
కరోనా వల్ల దొరికిన గ్యాప్ లో వీరిద్దరూ పెళ్లితో ఒకటి కాబోతున్నారనే వార్తలు కోలీవుడ్ లో ప్రచారం అవుతున్నాయి. నిజానికి పెళ్లికి నయనతార తొందరపడకపోయినా విఘ్నేష్ శివన్ ఇంట్లో మాత్రం తొందరపెడుతున్నారట. అందుకే నయనతార కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని కోలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది.