ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ కి బయలు దేరనున్నారు. కేంద్రం లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత మొదటిసారి జగన్ ఢిల్లీకి వెళ్తున్నాడు. అమిత్ షాతో పాటు అందుబాటులో ఉన్న మరి కొంతమంది కేంద్ర మంత్రులతో జగన్ భేటీ అయ్యే ఛాన్స్ ఉందని వైసీపీ వర్గాలు చెపుతున్నారు.
లాక్ డౌన్ అనంతరం ఏపీ ఆర్ధిక పరిస్థితి.. కేంద్రం వద్ద పెండింగులో ఉన్న వ్యవహరాలపై ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరపడానికే సీఎం వెళుతున్నట్టు చెబుతున్నారు. అలాగే ఇటీవల ఎస్ఈసీ విషయంలో జరిగిన పరిణామాలు, ఎల్జీ పాలిమర్స్ విషయంతో పాటూ శాసనమండలి రద్దు అంశంపై చర్చించే అవకాశాలు ఉన్నాయట. శాసనమండలి రద్దుకు పార్లమెంట్లో ఆమోదం పొందేలా చూడాలని కోరే అవకాశం ఉందట. అలాగే ఆక్వా ఎగుమతులకు అనుమతి ఇచ్చే అంశంపై చర్చించనున్నారట.