ఏపీ లో కరోనా కేసుల సంఖ్య ఎలా ఉందంటే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 76 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 3118 కరోనా కేసులు నమోదయ్యాయి.

34 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇద్దరు కరోనా వలన మరణించారు.ఇప్పటి వరకు 2169 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 885 యాక్టివ్ కేసులు ఉన్నాయి. లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడం , ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వస్తుండడం తో కేసులు పెరుగుతున్నట్లు నిపుణులు చెపుతున్నారు.