టివి కార్మికులను ఆదుకున్న తలసాని ట్రస్ట్..

లాక్ డౌన్ కారణంగా సినీ కార్మికుల కష్టాలు అన్ని ఇన్ని కావు..రోజు కూలి చేసుకుని బ్రతికే వారికీ గత 60 రోజులుగా షూటింగ్ లు బంద్ కావడం తో ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులంతా సీసీసీ చారిటి ద్వారా సాయం అందిస్తూ వస్తున్నారు. తాజాగా బుల్లితెర కార్మికుల కోసం కొంత మంది టీవీ కళాకారులు ,టెక్నిషన్స్ ను ఆయా టీవీ సంఘాలు ,దాతలు లను ఆదుకున్నారు.

మంత్రి తలసాని తన “తలసాని ట్రస్ట్ ” ద్వారా 2 వేల మంది టివి కార్మికులకు నిత్యావసర వస్తువులను టీవీ ఇండస్ట్రీ పెద్దలకు అందించారు. ఆ వితరణను అన్ని సంఘాల నాయకుల సమక్షంలో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఈ పంపిణీ జరిగింది . సహాయం పొందిన కార్మికులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలుపుగా .. టీవీ పరిశ్రమ అభివృద్ధికి మరింతగా తోడ్పాడాలని టీవీ సంఘాల నాయకులు కోరారు .