ఒకే రోజు ఏపీలో ఎన్ని కరోనా కేసులు నమోదు అయ్యాయో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు ఉదృతం అవుతున్నాయి. లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడం తో కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం… గత 24 గంటల్లో 9,370 శాంపిల్స్ టెస్ట్‌ చేస్తే 98 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

దీంతో.. రాష్ట్రంలో కరోనా కేసులు 3,042కు చేరాయి.కరోనా తో మరొకరు మృతిచెందడంతో.. ఏపీలో ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 62కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 845 మంది కరోనా బారినపడి చికిత్స తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖా తెలిపింది.