ఫస్ట్ పీరియడ్ విషయాలు తెలిపిన అనసూయ

తల్లి పోస్ట్ లో ఉన్న కానీ అనసూయ అందాలు మాత్రం రవ్వంత కూడా తగ్గడం లేదు…రోజు రోజుకు అమ్మడు రేంజ్ పెంచుకుంటూ పోతుంది. ప్రస్తుతం బుల్లితెర & వెండి తెరపై రాణిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియా లోను మూడున్నర మంది మిలియన్ ఫేస్ బుక్ ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు ఆమెకు సంబందించిన అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది. తాజాగా తన ఫస్ట్ పీరియడ్ విషయాలు తెలిపి షాక్ ఇచ్చింది.

మే 28న ‘అంతర్జాతీయ నెలసరి పరిశుభ్రతా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ ప్రోగ్రామ్ లో భాగంగా తన మొదటి పీరియడ్స్ అనుభవాన్ని దైర్యంగా అందరితో షేర్ చేసుకుంది. ఈ వీడియోని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. అనసూయ మాట్లాడుతూ.. ”నా ఫస్ట్ పీరియడ్ సమయంలో నేను గందరగోళానికి లోనయ్యాను. పీరియడ్ వచ్చిందా లేదా అనే డౌట్ వచ్చింది. నా మొదటి పీరియడ్ సమయంలో ఇంట్లో వాళ్ళు నన్ను ఎక్కడికి వెళ్లనీయకుండా ఇంట్లోనే ఓ మూలన కూర్చోబెట్టారు. ఫస్ట్ పీరియడ్ టైములో రెండు వారాలు అలానే ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రతినెలా నాలుగైదు రోజులు ఎవరినీ కలవనిచ్చేవారు కాదు. ఆ టైంలో ఏమి జరుగుతుందో నాకేమీ అర్థమయ్యేది కాదు. కానీ నాకు 17 ఇయర్స్ వచ్చిన తర్వాత దాని గురించి ఒక అవగాహన వచ్చింది. ఇంట్లో వాళ్ళు పీరియడ్స్ విషయంలో చేసింది కరెక్ట్ కాదని అర్థం అయింది.. కానీ వారిని నిందించడానికి ఏమీ లేదు. ఎందుకంటే అప్పటి పరిస్థితులు అలా ఉండేవి. పీరియడ్స్ గురించి ఎన్నో అపోహలు మూఢనమ్మకాలు ఉన్నాయి. నిజానికి అలాంటి సమయంలోనే మహిళలకి హెల్ప్ అవసరం. అలా దూరంగా ఉంచడం కరెక్ట్ కాదు” అని చెప్పుకొచ్చింది. ఇంకేమన్నదో ఆమె మాటల్లోనే వినండి.