రానా పెళ్లి డేట్ అదేనా ..?

భల్లాల దేవా ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతుండడం తో అభిమానులతో పాటు సినీ స్టార్స్ సైతం సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా లో తన పెళ్లి కబురు చెప్పడం ఆలస్యం రానాకు అంత విషెష్ అందించారు.

రీసెంట్ గా రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్‌ల నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక అట్టహాసంగా జరిగింది. ఇక పెళ్లి ఎప్పుడు అనేది అందరిలో చర్చ గా మారింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఆగస్ట్ 8న హైదరాబాద్ లో రానా – మిహీకల పెళ్లి జరగబోతోందనిఅంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ హల్ చల్ చేస్తోంది.