జులై లో మొదలు కానున్న మని డ్రీమ్ ప్రాజెక్ట్

మణిరత్నం ..ఈ పేరు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న గొప్ప డైరెక్టర్ ఈయన..ఒకప్పుడు ఈయన నుండి సినిమా వస్తుందంటే ఆ అంచనాలే వేరేలా ఉండేవి ..కానీ ప్రస్తుతం ఈయన సినిమా అంటే కనీసం చూసేందుకు కూడా ఇష్టపడం లేదు. వరుస ప్లాప్స్ వచ్చేసరికి మణి క్రేజ్ అంత తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఓ హిట్ కొట్టి మళ్లీ తన టాలెంట్ ఏంటో చూపించాలని తహతహలాడుతున్నాడు.

ప్రస్తుతం మణి క‌ల్కీ రాసిన పొన్నియ‌న్ సెల్వ‌న్ అనే చారిత్ర‌క న‌వ‌ల ఆధారంగా ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకోగా..లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా షూటింగ్ జులై నెల చివరి నుండి ప్రారంభం చేయనున్నట్లు సమాచారం. లాక్ డౌన్ అనంతరం పాండిచ్చేరిలో ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారట చిత్రయూనిట్. ఈ భారీ షెడ్యూల్లో హీరో విక్రమ్.. ఐశ్వర్య రాయ్.. కార్తీలు పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. పొన్నియన్ సెల్వన్ పార్ట్-1 పార్ట్ – 2 లుగా విడుదల కానుందట.