తెలంగాణ లో స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అంటే ..

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ అయ్యాయి. గత మూడు నెలలుగా స్కూల్స్ బంద్ కావడం ..ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి లో ఉండడం తో విద్యార్థులు తల్లిదండ్రులు అయోమయానైకి గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఆచితూచి అడుగులేస్తోంది. సాధారణంగా 2020-21 విద్యా సంవత్సరం జూన్ రెండో వారంలో ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో పరిస్థితులను బట్టి కాస్త ఆలస్యంగానే పాఠశాలలను దశలవారీగా తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులోభాగంగా జులై 5 వరకు పదో తరగతి పరీక్షలు ఉన్న వేళ ఆ తర్వాతే స్కూళ్లను తిరిగి తెరవాలని భావిస్తున్నారు. దీనిపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి త్వరలో సమావేశం నిర్ణయించనున్నారు. దశల వారీగా తెరవడంలోనూ మొదటగా 8, 9, 10 తరగతులు ప్రారంభించాలని భావిస్తున్నారు.