రెండు నెలలుగా సినిమా షూటింగ్ , థియేటర్స్ బంద్ కావడం తో నిర్మాతలు , కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్ లకు అనుమతి ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి షూటింగ్ ఆకూ అనుమతి కోరడం జరిగింది.
ఇప్పటికే సీరియల్స్ తాలూకా షూటింగ్ మొదలు అవ్వగా ..ఆయా నటి నటులంతా మళ్లీ షూటింగ్ లకు సిద్ధమవుతున్నారు. ఇక వెండితెర సినిమాల తాలూకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ చేయగా ..ఇక షూటింగ్ లు జూన్ 15 నుండి మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇక షూటింగ్ లలో ప్రభుత్వం తెలిపిన ఆంక్షలు తప్పనిసరి పాటిస్తూ షూటింగ్ లు స్టార్ట్ చేయాలనీ సినీ పెద్దలు చూస్తున్నారు.