రెండు నెలలుగా సినిమా షూటింగ్ , థియేటర్స్ బంద్ కావడం తో నిర్మాతలు , కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్ లకు అనుమతి ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని ని కలవడం , ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి షూటింగ్ లకు అనుమతి కోరడం జరిగింది. అయితే ఈ విషయం తనకు తెలియదని చెప్పి పెద్ద షాకే ఇచ్చాడు బాలకృష్ణ.
ఈ చర్చకు తనను ఎవ్వరు పిలవలేదని , అందరిలానే తాను మీడియాలో చూసి తెలుసుకున్న అని బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలకు నిర్మాత సి కళ్యాణ్ స్పందిస్తూ ..మాకు ఎవరితో అవసరం ఉంటే వల్లనే పిలుస్తామని అన్నారు. చిరంజీవికి ఫెస్ వాల్యూ ఉంది కాబట్టే ఆయనను పిలిచామని కళ్యాణ్ అనడంతో ఈ వివాదం ముదిరింది.
ఇక ఇదే విషయం పై సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని ని మీడియా ప్రశ్నించగా .. బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు. “బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇప్పుడు స్పందించను… ఎందుకన్నాడో కనుక్కొని అప్పడు మాట్లాడుతా .. “అని తలసాని అన్నారు. నియమనిబంధనలతో సినిమా షూటింగ్స్ కు అనుమతి ఇస్తున్నామని, జాగ్రత్త చర్యలు బాధ్యత సినీపెద్దలదే అని తలసాని పేర్కొన్నారు.