కొండపోచమ్మ ఆలయంలో కేసీఆర్ దంపతులు

రైతన్న సాగునీటి కష్టాలు తీర్చే కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ ఈరోజు కేసీఆర్ చేతుల మీదుగా మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే కేసీఆర్ దంపతులు కొండపోచమ్మ ఆలయంకు చేరుకున్నారు. మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి, ఇతరులు ఘన స్వాగతం పలికారు.

సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎంపీ సంతోష్, ఇతర అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు గోపూజ నిర్వహించారు. అనంతరం శుక్రవారం తెల్లవారుజామున నుంచి నిర్వహిస్తున్న చండీయాగం పూర్ణాహుతిలో పాల్గొన్నారు.

అనంతరం..వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఉదయం 9.35కి ఎర్రవల్లిలో.. 9.40కి మర్కుక్‌లోని రైతు వేదికలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 9.50కి మర్కుక్ పంప్‌హౌస్‌ చేరుకోనున్న ముఖ్యమంత్రి… 10గంటలకు అక్కడికి హెలికాప్టర్‌లో చేరుకునే చిన్నజీయర్ స్వామిని ఆహ్వానిస్తారు. ఆ తర్వాత మర్కుక్‌ పంప్‌హౌజ్‌ వద్ద జరిగే సుదర్శనహోమం, పూర్ణాహుతి కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొంటారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఉదయం 11.30 గంటలకు పంప్‌ హౌస్‌ స్విచ్‌ ఆన్‌ చేసి రిజర్వాయర్‌ను ప్రారంభిస్తారు.

సిద్దిపేట జిల్లాలో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు యాదాద్రి భువనగిరి, మేడ్చల్ జిల్లాలకు సాగు నీరందనుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింక్ 4, ప్యాకేజీ 14లో భాగంగా సముద్ర మట్టానికి 510 మీటర్ల ఎత్తులో దాదాపు రూ.1,600 కోట్ల వ్యయంతో కొండ పోచమ్మ ప్రాజెక్టు చేపట్టారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో ఐదు జిల్లాల పరిధిలోని 2.85 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు హైదరాబాద్ నగరానికి తాగునీటి సౌకర్యం కలుగుతుంది. ఈ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గజ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గం పరిధిలోని దాదాపు 26 వేల ఎకరాలకు సాగు నీటిని అందిస్తారు.