తేజ్ మరో సినిమాకు ఓకే చెప్పాడా ..?

చిత్రలహరి , ప్రతి రోజు పండగే చిత్రాలతో మెగా హిట్స్ అందుకున్న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రం చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP బ్యానర్‌పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుబ్బు డైరెక్ట్ చేస్తున్నాడు. సుబ్బు చిత్రానికి ఇది మొదటిది కావడం విశేషం. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే ‘ప్రస్థానం’ ఫేమ్ దేవకట్టా దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.

ఈ సినిమాలో తేజ్ క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంటుందని.. ఇప్పటి వరకు ఆయన కెరీర్లో ట్రై చేయని జోనర్ అని తెలుస్తోంది. నటుడిగా ఇది మెగా మేనల్లుడి మరో స్థాయికి తీసుకుపోయే సినిమా అవుతుందని ఇప్పటికే డైరెక్టర్ దేవాకట్టా వెల్లడించారు.

ఈ క్రమంలో మెగా సుప్రీమ్ హీరో మరో సినిమా ఓకే చేసాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసిస్టెంట్ గా పని చేసిన వ్యక్తి ఈ చిత్రానికి డైరెక్షన్ చేయబోతున్నాడట. అయితే ఈ సినిమాని ముగ్గురు నిర్మాతలు కలిసి నిర్మించబోతున్నారట. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు బీవీఎస్.యన్ ప్రసాద్ మరియు వైష్ణో కృష్ణ కలిసి సంయుక్తంగా తేజ్ తో సినిమా తీయబోతున్నారట. ఇప్పటికే స్టోరీ లైన్ తేజ్ కి నచ్చిందని.. ఇండస్ట్రీలో పరిస్థితులు చక్కబడిన వెంటనే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అవుతాయని వినికిడి.