రెండు నెలలుగా సినిమా షూటింగ్ , థియేటర్స్ బంద్ కావడం తో నిర్మాతలు , కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్ లకు అనుమతి ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి షూటింగ్ ఆకూ అనుమతి కోరడం జరిగింది. అయితే ఈ విషయం తనకు తెలియదని చెప్పి పెద్ద షాకే ఇచ్చాడు బాలకృష్ణ.
ఈ ఉదయం ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించిన అనంతరం, మీడియాతో మాట్లాడిన ఆయన, సినిమా ఇండస్ట్రీ ప్రతినిధులు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన విషయం తనకు తెలియదని ఆయన అనడం గమనార్హం. పత్రికల్లో చూసి తాను ఈ విషయాన్ని తెలుసుకున్నానని, సాధ్యమైనంత త్వరగా షూటింగ్స్ తిరిగి మొదలైతే, కష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమకు కొంతైనా మేలు కలుగుతుందన్నారు. భవిష్యత్తులో తక్కువ మంది కార్మికులతో భౌతిక దూరం పాటిస్తూ సినిమాలు తీయాల్సి వుంటుందని తెలిపారు.