నందమూరి తారకరామారావు 97వ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు , చిత్ర సీమా ప్రముఖులు , తెలుగుదేశం పార్టీ నేతలు , కార్య కర్తలు జయంతి వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భాంగా ఎన్టీఆర్ కు వీరాభిమాని అయినా వైవీఎస్ చౌదరి రెండు జిల్లాలకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేసారు.
ఈ నేపథ్యంలో ఎన్టీయార్ గురించి వైవీఎస్ చౌదరి ఓ లేఖ విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ఏవైనా రెండు జిల్లాలకు ఎన్టీయార్ పేరు పెట్టాలని, ఎన్టీయార్‌కు `భారతరత్న` వచ్చేలా కృషి చేయాలని ప్రభుత్వాలను కోరారు.