ప్రస్తుతం కరోనా వైరస్ హల్చల్ చేస్తుంది. ఎవర్ని వదిలిపెట్టకుండా పంజా విసురుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులపై కరోనా ఎఫెక్ట్ గట్టిగా ఉంది. మే 14న బాలీవుడ్ నటుడు కిరణ్ కుమార్ (74) కరోనా బారిన పడ్డారు. మెడికల్ చెకప్‌లో భాగంగా ఆయన ఆసుపత్రికి వెళ్లగా, కరోనా ఉన్న విషయం బయటపడింది. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కిరణ్ కుమార్‌కి లేకపోవడంతో వైద్యులు షాక్ అయ్యారు.
కరోనా పాజిటివ్ రావడంతో కిరణ్ వెంటనే స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. తగు జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో మూడోసారి జరిపిన టెస్ట్‌లో నెగెటివ్ అని తేలడం తో అంత షాక్ అయ్యారు.