రెండు నెలలుగా సినిమా షూటింగ్ , థియేటర్స్ బంద్ కావడం తో నిర్మాతలు , కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్ లకు అనుమతి ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికీ తీపి కబురు ప్రభుత్వం నుండి అందింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి అనుమతి ఇవ్వడం తో వారంతా ఆ పనుల్లో బిజీ అయ్యారు. త్వరలో థియేటర్స్ ఓపెనింగ్ కు కూడా తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది.
ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సినీ ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. సినీరంగం పట్ల ప్రభుత్వం ఎప్పుడు సానుకూల ధోరణితో వ్యవహరిస్తుందని తెలిపారు.. లాక్‌డౌన్‌తో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్‌లు నిలిచిపోవడంతో.. ఈ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. సినీ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుందని వెల్లడించారు. పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునేందుకు సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం.. షూటింగ్‌లు, థియేటర్స్ ఓపెనింగ్‌కు సంబంధించిన అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.