మెగా బ్రదర్ నాగబాబు మొదటి నుండి కూడా వైసీపీ ప్రభుత్వం ఫై నిప్పులు చెరుగుతూనే ఉన్నాడు. కాస్త సందు దొరికితే చాలు సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా నడుస్తున్న టీటీడీ భూముల అమ్మకాల వ్యవహారం ఫై నాగబాబు స్పందించారు.
తిరుమల వెంకటేశ్వరస్వామి భూములను అమ్మే హక్కు టీటీడీకి లేదంటూ ట్వీట్ చేశారు నటుడు నాగబాబు. వెంకన్న ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత టీటీడీదేనని అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దని, స్వామి వారి ఆస్తులను అమ్మాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుండా ఈ విషయంపై ఖచ్చితంగా నిరసన తెలుపుతామని అన్నారు.
అలాగే మంచు మనోజ్ కూడా ఈ వ్యవహారం ఫై ఓ లేఖ విడుదల చేసారు. టీటీడీ ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా? కరోనా సంక్షోభంలో రోజుకు లక్ష మందికి ఆకలి తీర్చమని కూడా దేవుడు ఏమన్నా చెప్పాడా? చేసేది, చెప్పేది అంతా టీటీడీ పాలక మండలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తులను, కొండకి వచ్చిన లక్షలాది మందిని, సుప్రభాత సేవకి టైమ్ అయ్యింది నిద్ర లేవాలి.. అని శ్రీహరిని సైతం కంట్రోల్ చేసేది టీటీడీ పాలక మండలి. కొండపైన ఉన్న వడ్డీ కాసులవాడి ఆస్తులు అమ్మకానికి వచ్చాయి అంటే ‘గోవిందా గోవిందా’ అని అరచిన ఈ గొంతు కొంచెం తడబడింది. మోసం జరగట్లేదు అని తెలుసు. ఎందుకంటే ఇన్సైడ్ ట్రేడింగ్ లాగా కాకుండా వేలం వేసి అందరి ముందూ అందరు చూస్తుండగానే అమ్మకం జరుపుతారు. కానీ, ఎందుకు అమ్ముతున్నారు?.. అని పాలక మండలిని కాస్త వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వివరణ మాత్రమే. ఏమీ లేదు సార్. ఇంత పెద్ద కొండ మాకు అండగా ఉంది అని చూస్తూ మురిసిపోయే తిరుపతి వాడిని కాబట్టి ఆపుకోలేక అడుగుతున్నా సార్.. అంతే. జై హింద్.. అంటూ ముగించారు.
తిరుపతి వెంకటేశ్వర స్వామి కి సంబంధించిన ఆస్థులని కాపాడే బాధ్యత తిరుపతి పాలకమండలిది. అంతే కాని స్వామి వారి భూములను అమ్మే హక్కు మీకు లేదు..హిందువుల మనోభావలని దెబ్బ తీయకండి.నిర్ణయాలని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా.ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాను.
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 25, 2020
#TTD ?? pic.twitter.com/71PaFMPWbz
— MM*??❤️ (@HeroManoj1) May 25, 2020