టీటీడీ భూముల వ్యవహారం ఫై వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ

గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో టీటీడీ భూముల అమ్మకాల వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తుంది. వైసీపీ సర్కార్ ఫై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. శ్రీవెంకటేశ్వర స్వామి విషయంలో రాజకీయాలు చెయ్యొద్దని అన్నారు. భక్తులు సమర్పించే ప్రతి పైసాను తాము కాపాడుతున్నామని, పదవిలో ఉన్నా లేకుండా ఈ విషయంలో రాజీపడబోమని అన్నారు.

టీటీడీ భూముల విక్రయాన్ని తామేమి కొత్తగా చేయడం లేదని, 1970 నుంచి 2014 వరకు అప్పటి ప్రభుత్వాలు ఇలానే అమ్మకాలు చేపట్టాయని అన్నారు. 2016లో అప్పటి టీటీడీ సబ్ కమిటీ భూములను అమ్మాలని నిర్ణయం తీసుకుంది. అయితే, అప్పుడు బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించామని, అమ్మాలని ఆదేశాలు ఇవ్వలేదని అన్నారు. అమ్మకాల విషయాన్నీ వచ్చే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు.