కరోనా కట్టడి లో భాగంగా కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వేళ అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని పోలీసులు హెచ్చరించారు. అయినాగానీ కొంతమంది అవేమి పట్టించుకోకుండా రోడ్ల పైకి రావడం తో పోలీసులు వారి వాహనాలను సీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ వాహనాలను తిరిగి ఆ వాహన దారులకు ఇస్తున్నారు. ఈ మేరకు ఏపీ పోలీసులు యజమానులు తమ వాహనాలకు సంబంధించిన పత్రాలను పీఎస్లో సమర్పించి వాహనాలు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.