తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా చాలామందే చనిపోయారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో మాత్రం ఒక్క మరణం కూడా సంభవించలేదని నిన్నటివరకు అనుకున్నాం కానీ ఈరోజు మొదటి మరణం సంభవించింది.
పోలీసు కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి ట్వీట్ చేశారు. బుధవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు డీజీపీ మహేందర్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని డీజీపీ భరోసానిచ్చారు.
#PoliceConstableOfficer Dayakar Reddy a #Covid19FrontLineWarrior of @hydcitypolice died of #CoronaVirus last night @ GandhiHospital.
My Heartfelt Condolences to the bereaved family members. The Govt & #TSPolice will standby & support the family in #TheHourOfDistress by all means. pic.twitter.com/6eybsLycfj— DGP TELANGANA POLICE (@TelanganaDGP) May 21, 2020