కరోనా దెబ్బకు అన్ని సంస్థలు మూతపడ్డాయి. వాటిల్లో స్కూల్స్ కూడా ఒకటి. లాక్ డౌన్ కారణంగా చాలా స్కూళ్లలో పరీక్షలు కూడా నిర్వహించలేదు. ఇప్పటికే రెండు నెలలుగా పిల్లలు ఇంటిలోనే ఉండడం తో స్కూల్స్ ఎప్పుడు అవుతాయో అనే టెన్షన్ పిల్లల తల్లిదండ్రుల్లో నెలకొని ఉంది. అయితే ఆ టెన్షన్ కు తెరదించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
పాఠశాలలను ఆగస్టు 3 నుంచి పునః ప్రారంభించాలని నిర్ణయించింది. అంతే కాదు స్కూళ్లలో నాడు-నేడు కింద చేపట్టిన అభివృద్ధి పనులను జులైలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మొదటి విడత 15 వేల 715 పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు స్కూళ్లలో 9 రకాల సదుపాయాలు కల్పించేందుకు 456 కోట్ల రూపాయల రివాల్వింగ్ ఫండ్ కూడా విడుదల చేశారు. జులైలో నెలాఖరులోగా పనులు పూర్తి చేసేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు.