ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 52 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ఈ కొత్త కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,282కి చేరింది.
ఈ 52 కేసుల్లో చిత్తూరు-15, తూర్పుగోదావరి-05, కడప 2, కృష్ణా- 15, కర్నూలు-04, నెల్లూరు-07, విశాఖ, విజయనగరంలో ఒక్కో కేసు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాని ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్లో తెలిపింది.
జిల్లావారీగా చూస్తే..