కరోనా వైరస్ కారణంగా ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. తెలుగు దేశం అధినేత , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సైతం హైదరాబాద్లో ఉండిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగాల్సిన మహానాడును కూడా ఆన్లైన్లోనే నిర్వహించాలని నిర్ణయించారు చంద్రబాబు.
ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ సభ ద్వారా మహానాడు నిర్వహణ అసాధ్యం. దీంతో, జూమ్యాప్తో గరిష్టంగా రెండు రాష్ట్రాల్లో 10 వేల మందితో మహానాడుకు ప్లాన్ చేస్తున్నారు బాబు. ఒకవేళ అదే జరిగితే 10 వేల మందితో కొత్త రికార్డ్ అవుతుందంటున్నారు తెలుగు తమ్ముళ్లు.. కాగా, ఎన్నికల ఫలితాల కారణంగా గత ఏడాది మహానాడు నిర్వహించలేదు. కరోనా కారణంగా ఈ ఏడాది సాధ్యం కావడం లేదు. దీంతో మూడు రోజుల పాటు ఆన్లైన్లో నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది.