లాక్‌డౌన్‌ యథావిధి: కేసీఆర్

రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్‌ నిబంధనలు యథావిధిగా అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు లాక్‌డౌన్‌పై కేంద్రం మార్గదర్శకాలను పరిశీలించి రాష్ట్రంలో వ్యూహం ఖరారు చేస్తామన్నారు.

కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు కొనసాగించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఏసీల విక్రయ దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఆటోమొబైల్‌ షోరూంలు, ఆటో మొబైల్‌ విడిభాగాల అమ్మకపు దుకాణాలకు అనుమతిస్తున్నట్లు చెప్పారు.