ఏపీ ప్రజలకు సాయం చేసిన లారెన్స్

క్రొయోగ్రాఫర్ గా చిత్ర సీమలో అడుగుపెట్టిన రాఘవ లారెన్స్..ఆ తర్వాత నటుడి గా డైరెక్టర్ గా నిర్మాత గా ఇలా తనలోని కోణాలను బయటపెట్టి సక్సెస్ అయ్యాడు. ఆలా సంపాదించిన డబ్బుతో ఎంతోమంది కుటుంబాలను ఆదుకుంటూ వస్తూ అభిమానుల్లో దేవుడయ్యాడు . కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న అనేక మందికి ఆర్థికంగా ఆయన సహాయం చేయడం జరిగింది.

కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన 37 కూలీలు తమిళ నాడులో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వారిని సొంత ప్రాంతాలకు చేర్చే ఏర్పాట్లు చేయవలసిందిగా తమిళనాడు సీఎం ని లారెన్స్ కోరారు. లారెన్స్ అభ్యర్ధనను మన్నించి తమిళనాడు ప్రభుత్వం వారిని స్వస్థలాలకు చేర్చడం జరిగింది. ఇందుకు రాఘవ లారెన్స్ నేడు తమిళనాడు ముఖ్య మంత్రి పళని స్వామిని స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.