ఇప్పటివరకు ఏ పంట వేసిన దానికి రైతు బంధు కింద డబ్బులు ఇచ్చిన తెలంగాణ సర్కార్. ఇక నుండి ఆలా ఇవ్వదని స్పష్టం చేసింది. ప్రభుత్వం చెప్పిన పంట వేస్తేనే రైతు బంధు ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేసారు. రైతులందరూ ఒకే పంటను సాగు చేసి గిట్టుబాటు ధర లేక ఇబ్బందుల పడే పరిస్థితిని తప్పించాలని యోచిస్తోంది. ఇందుకోసం వ్యవసాయాన్ని క్రమబద్దీకరణ చేసే దిశగా అడుగులేస్తోంది. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించనుంది.
వర్షాకాలం సీజన్లో 50 లక్షల ఎకరాలకు వరిసాగును పెంచాలని కేసీఆర్ సర్కారు భావిస్తోంది. ఇప్పుడు సాగు చేస్తున్న రకాలకు తోడు తెలంగాణ సోనా రకం ధాన్యాన్ని 10 లక్షలకుపైగా ఎకరాల్లో సాగు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 50 లక్షల ఎకరాల్లో పత్తి, 10 లక్షల ఎకరాల్లో కంది పండించాలని యోచిస్తోంది.
రైతులు ఏ పంటలు పండించాలనే విషయమై ప్రభుత్వమే వారికి సూచనలు చేయనుంది. ప్రభుత్వ సలహాల మేరకు పంట సాగు చేసిన రైతులకు మాత్రమే రైతు బంధు వర్తింపజేయాలని నిర్ణయించారు.