అక్కడ మాత్రం జూన్ 08 వరకు లాక్ డౌనేనట..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు ప్రతి రోజు బయటపడుతూనే ఉన్నాయ్. అయినప్పటికీ జగన్ సర్కార్ మాత్రం కేంద్రం ప్రకటించిన సడలింపులు ఆధారంగా నడుచుకుంటుంది. కాగా కృష్ణా జిల్లా నూజివీడులో మాత్రం జూన్‌ 8 వరకు 28 రోజుల పాటూ లాక్‌డౌన్‌ కొనసాగిస్తామని తహశీల్దార్ అంటున్నారు.

నాలుగు రోజుల క్రితం స్థానిక మైలవరం రోడ్డుకు చెందిన మహిళకు ట్రూ నాట్ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ తేలింది. తర్వాత ఆమె శాంపిల్స్ విజయవాడకు పంపించగా.. అక్కడా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. దీంతో ఆ ప్రాంతాన్ని రెడ్‌ జోన్‌‌గా ప్రకటించారు. ఇక మిగిలిన పాంతాల్లో కూరగాయలు, నిత్యావసర సరకుల దుకాణాలు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే తెరవాలని చెప్పారు. మరోవైపు కృష్ణా జిల్లాలో మొత్తం 342 కేసులు నమోదయ్యాయి. 187 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. 142మంది డిశ్చార్జ్ అయ్యారు. జిల్లావ్యాప్తంగా కరోనా వైరస్‌తో 13మంది చనిపోయారు. దీంతో లాక్ డౌన్ ఎత్తేస్తే ప్రమాదమని భావించిన తహశీల్దార్ జూన్ 08 వరకు లాక్ డౌన్ చేస్తేనే మంచిందని అంటున్నారు.