తెలంగాణ రాష్ట్రంలో గత వారం కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టగా..ఈ వారం మాత్రం మళ్లీ పెరగడం స్టార్ట్ అయ్యాయి. నిన్న ఏకంగా 31 కేసులు నమోదు అవడం తో మళ్లీ ప్రజల్లో భయం మొదలయ్యింది. ఇక మంచిర్యాల లో ఒకే కుటుంబం లో ముగ్గురికి కరోనా సోకడం నగరంలో చర్చ గా మారింది.
ఒకే కుంటుంబానికి చెందిన వీరు పొరుగున ఉన్న మహారాష్ట్రకు వెళ్లిరావడంతోనే వైరస్ సోకినట్లు వైద్యాధికారులు గుర్తించారు. బాధితుల్లో 80 ఏళ్ల వయస్సు ఒకరు, 70 ఏళ్లు మరొకరు, 30 ఏళ్ల యువకుడు ఉన్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు అప్రత్తమయ్యారు. కొంతకాలంగా వీరు మహారాష్ట్ర ఉంటూ రాపల్లికి రాకపోకలు సాగిస్తున్నారు. గత ఫిబ్రవరిలో బాంద్రాలో వారి ఇంటి ఆస్తి పరిష్కారం కోసం వెళ్లి అక్కడే చిక్కుకుపోయారు. దేశవ్యాప్తంగా ఈ నెల 3 నుంచి లాక్డౌన్ సడలించడంతో బాధితులు ఈ నెల 5న సొంతూరు హాజీపూర్ మండలం రాపల్లికి తిరిగి వచ్చారు