ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి జులై లో తీవ్ర రూపం దాల్చనుందని..ముఖ్యంగా తమిళనాడు లో కరోనా వైరస్ దారుణంగా ఉండబోతుందని హెచ్చరించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆ సంస్థ రాయబారి డేవిడ్ నబరే విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల్లో తమిళనాడు గురించి ప్రస్తావించడం హాట్ టాపిక్ అయ్యింది. ఆయన ఏమన్నారంటే.. భారత్లో కరోనా వైరస్ కట్టడయ్యేందుకు ముందు జూలైలో ఉచ్చస్థితికి చేరుకుంటుంది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతాయి. అయినాగానీ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.
పాజిటివ్ కేసులు పెరిగినా వైరస్ వ్యాప్తి స్థిరంగా ఉంటుంది. జనాభా అత్యధికంగా ఉండే భారత్లో వైరస్ కట్టడి చేయడం ఎంతో కష్టం. భారత్లో లాక్డౌన్ చర్య ఎంతో మంచి ఫలితాలను ఇచ్చింది. మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడులో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. భారత్లో ప్రస్తుతం వేసవి నడ వడం ఎంతో మంచిది. ఎండ వేడిమి వల్ల వైరస్ వేగంగా వ్యాపించదు అని తెలిపారు. వైరస్ వ్యాప్తి విశ్వరూపాన్ని ప్రదర్శించి కోయంబేడు మార్కెట్ 2,167 మందిని బా«ధితులుగా మార్చింది. పొరుగు జిల్లాల నుంచి వచ్చే హోల్సేల్, రిటైల్ కూరగాయల వ్యాపారులు భౌతికదూరం పాటించడంలో నిర్లక్ష్యాన్ని చూపడం శాపంగా మారింది. దీనివల్ల అక్కడ వైరస్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని అన్నారు.