బాక్స్ ఆఫీసు పై చిన్న సినిమాల దండయాత్ర

No theatres for small films this weekపెద్ద చేప చిన్న చేప ని మింగేసే సంస్కృతి సినీ పరిశ్రమలోనూ వుంది. స్టార్ హీరో సినిమా వస్తోందంటే చిన్న సినిమా బిక్కు బిక్కుమంటూ గడపాల్సిందే. ఎందుకంటే థియేటర్ లు దొరకవు. రాష్ట్రంలో సగం థియేటర్లను ఒక్క సినిమా ఆక్రమించుకుంటుంది. అందుకే పెద్ద సినిమా జాడ లేనప్పుడే చిన్న సినిమాలు తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారు. మర్చి నెలలో పరీక్షల గొడవ వుంటుంది. యూత్ సినిమా థియేటర్ చుట్టుపక్కల కనిపించరు. ఈ దశలో పెద్ద సినిమా తీసుకొస్తే దెబ్బడిపొద్ది అనేది నిర్మాతల భయం. అందుకే ఈ నెలలో స్టార్ హీరోల సినేమాలేమీ రాలేదు. ఏప్రిల్ వరకు ఆ భయం లేదు కుడా. అందుకే చిన్న సినిమాకి సందు దొరికింది. ఈ వారం ఏకంగా 7 సినిమాలు ప్రేక్షకుల తీర్పు కోరబోతున్నాయి. ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’, ‘ఆపరేషన్ దుర్యోధన 2’, ‘దశమి’, ‘3జి లవ్’, ‘జగన్’, ‘అలజడి’, ‘రేయ్ రేయ్’.. బాక్స్ ఆఫీసు పై దండయాత్ర చేయబోతున్నాయి. వీటిలో ‘బ్యాక్ బెంచ్…’ పైనే పరిశ్రమకు కొన్ని అంచనాలు వున్నాయి. మిగతా వాటిని లైట్ తీసుకున్నారు. ‘3జి లవ్’, ‘రేయ్ రేయ్’ సినిమాలు ఘాటు ఘాటుగా ఉన్నాయనే టాక్ రావడంతో కాస్త వాటిపై ఫోకస్ చూపించే అవకాశం వుంది. అయితే.. ‘బ్యాక్ బెంచ్’ సినిమా తప్ప మిగతావి  నామమాత్రమైన సంఖ్య లోనే థియేటర్ లు దక్కాయి. కొన్ని ఒక్క థియేటర్ కే పరిమితం అయ్యాయి. మార్చ్ ముగిసే లోగా మరిన్ని చిన్న సినిమాలు సందడి చేసే అవకాశం వుంది.