ముఖ్యమంత్రి ఫై సూపర్ స్టార్ ఆగ్రహం

సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ నాడు సీఎం పళని స్వామిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. లాక్ డౌన్ సమయం లో మద్యం అమ్మకాలు జరపడాన్ని ఆయన తప్పుబట్టారు. కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలలో తమిళనాడు ఒకటి. ఐనప్పటి కొన్ని రోజులుగా తమిళనాడు మద్యం అమ్మకాలు జరుపుతుంది. తమిళనాడు హై కోర్ట్ మద్యం డోర్ డెలివరీ ద్వారా చేయాలని సూచించగా, ఆదాయం తగ్గిపోతుందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

దీనిని తప్పు బడుతూ రజినీకాంత్ ‘ఒకవేళ ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరవాలనుకుంటే.. మళ్లీ అధికారంలోకి రావాలన్న కల మరిచిపోవాల్సిందే. ఆదాయం కోసమే అయితే ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలి’ అని రజనీ విమర్శించారు.