బియ్యం డోర్ డెలివరీ : జగన్


సెప్టెంబరు 1న రాష్ట్రవ్యాప్తంగా బియ్యం డోర్ డెలివరీ పథకాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు ఏపీ సీఎం. బియ్యంలో నాణ్యత, పంపిణీలో పారదర్శకతే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అవినీతికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పథకం అమలు చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా అధికారులు సీఎం జగన్ కు పలు అంశాలు నివేదించారు. గ్రామసచివాలయాల్లో 13,370 మొబైల్ యూనిట్లు ఉన్నాయని, మొబైల్ యూనిట్ లోనే ఎలక్ట్రానిక్ కాటా ఉంటుందని తెలిపారు. లబ్ధిదారుల ముందే బస్తా సీల్ తీసి కోటా బియ్యం అందిస్తామని చెప్పారు.