జగన్ కు పాలాభిషేకం


ఎన్నికల ప్రచారంలో చేసిన హామీలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నాడు. ఇప్పటికే పలు హామీలను హామీలను అమలు చేయగా ..తాజాగా బుధవారం(మే 6,2020) మత్స్యకార భరోసా కార్యక్రమం ప్రారంభించారు. మత్స్యకార భరోసా కింద ఆయా కుటుంబాలకు రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని బటన్‌ నొక్కి వారివారి ఖాతాల్లోకి పంపారు. సముద్రంలో వేట సాగించే మత్స్యకారులకు వేట నిషేధభృతిని రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. నేరుగా మత్స్యకారుల ఖాతాల్లో సొమ్ము జమ అయ్యింది. వేట నిషేధం కారణంగా ఉపాధి లేక ఇంట్లోనే ఉన్న మత్స్య కార్మికులు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది.

మత్స్యకార భరోసా పథకం ద్వారా తమకు ఆర్థిక సాయం అందించారని, తమ కుటుంబాల్లో ఆత్మ స్థైర్యం నింపారంటూ సీఎం జగన్ పై నెల్లూరు జిల్లా మత్స్యకార కుటుంబాలు జగన్ ఫోటో కు పాలాభిషేకం చేస్తూ ప్రసంశలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట సముద్రతీరంలో జగన్, స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సముద్రతీరం వద్దే మేజర్ ఫిషింగ్ హార్బర్ నిర్మించేందుకు ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారని, అందుకు వారికి రుణపడి ఉంటామని అన్నారు.