జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయతో ఈ రోజు ఫోన్లో ముచ్చటించడం ఎంతో ఆనందం కలిగించిందని తెలిపారు.
గౌరవనీయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారితో ఈ రోజు జరిగిన టెలిఫోన్ సంభాషణ ఎంతో ఆప్యాయంగా కొనసాగింది. విశాఖలో జరిగిన దుర్ఘటన పై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేసారు. ఎల్.జి.పాలిమర్స్ లో గ్యాస్ లీకేజీ కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోవడం, వందలాది మంది ఆస్పత్రి పాలవడం తీవ్రంగా కలచివేసిందని ఆయన చెప్పారు.
కరోనా మూలంగా తలెత్తిన పరిస్థితులు, లాక్ డౌన్ పరిణామాలను గురించి చర్చించారు. తరచూ ఫోన్లో సంభాషించే శ్రీ దత్తాత్రేయ గారు ప్రజా సంబంధమైన అనేక విషయాల గురించి మాట్లాడుతుంటారు. ఆయన మాటలు, ప్రజా జీవిత అనుభవాల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ఈ రోజు ఆయనతో ఫోన్లో ముచ్చటించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అన్నారు.