తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరల వివరాలు

లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా మద్యం షాపులు బంద్ కావడం తో మందు ప్రియులు తట్టుకోలేకపోయారు. బ్లాక్ లో వేలు పోసి మద్యం కోలుగోలు చేసారు. మరికొంతమంది మద్యం దొరకక పోవడం తో పిచ్చోళ్ళు అయ్యారు. ఇక సోమవారం నుండి అన్ని జోన్లలో మద్యం అమ్మకాలు ప్రారంభం మొదలు కావడం తో మందు బాబులు పండగ చేసుకుంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నుండి మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి.

కంటెన్మెంట్ జోన్స్‌లోని మద్యం షాపులు మూసి ఉంటాయని కేసీఆర్ చెప్పారు. బార్లు, క్లబ్బులు, పబ్బులకు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేశారు. చీప్ లిక్కర్‌ ధరలను 11 శాతం పెంచిన ప్రభుత్వం.. మిగతా మద్యం ధరలను 16 శాతం వరకు పెంచింది. చీప్ లిక్కర్‌ ఫుల్ బాటిల్‌పై రూ.40 పెంచిన సర్కారు.. ఆర్డినరీ లిక్కర్‌ ఫుల్ బాటిల్‌ ధరను రూ. 80, స్కాచ్ లిక్కర్ ధరను రూ.160 వరకు పెంచింది. బీరు ధరలను రూ.30 పెంచింది.