మద్యం దుకాణాల వద్ద మహిళల నిరసన


మద్యం దుకాణాలు తెరవడానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో మహిళలు నిరసన చేపట్టారు. స్థానిక మహిళలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కూరగాయల షాపులను రోజుకు మూడు గంటలు మాత్రమే తెరుస్తున్నారు. అదే సమయంలో మద్యం దుకాణాలను ఏడు గంటలు తెరవడమేంటి’’ అంటూ మహిళలు ప్రశ్నించారు.

కాగా మద్యం తాగేవారి సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు మరో 50శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాలు తెరిచే సమయానికే గతంలో ఉన్న రేట్లకంటే 25శాతం పెంచగా.. ఇప్పుడు అదనంగా మరో 50శాతం మేర పెంచారు.