మద్యం తాగేవారి సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు మరో 50శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాలు తెరిచే సమయానికే గతంలో ఉన్న రేట్లకంటే 25శాతం పెంచగా.. ఇప్పుడు అదనంగా మరో 50శాతం మేర పెంచారు. దీనిపై సిఎం జగన్ స్పందించారు.
రాష్ట్రంలో మద్యపానాన్ని నిరుత్సాహపరిచేందుకే భారీగా ధరలు పెంచామని అన్నారు. మద్యం రేట్లు షాక్ కొట్టేలా ఉండాలని అనుకున్నామని తెలిపారు. మున్ముందు మద్యం అమ్మకాలు తగ్గుతాయని భావిస్తున్నట్టు వెల్లడించారు. మద్యం దుకాణాలు 13 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామని, తద్వారా రాష్ట్రంలో మద్యం దుకాణాలు 33 శాతం తగ్గించినట్టవుతుందని వివరించారు