ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాలు తెరవడంపై నారా మాజీ సిఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల నిన్న ఆరుగురు చనిపోయారని చంద్రబాబు విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్లో నిన్న అకస్మాత్తుగా మద్యం దుకాణాలు తెరిచారు… మద్యం దుకాణాలు వద్దని కొన్ని చోట్ల మహిళలు ఆందోళన చేశారు అని చంద్రబాబు తెలిపారు. మద్యం దుకాణాలను పోలీసులతో నియంత్రిస్తారా? చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద పెడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. కంటైన్మెంట్ జోన్లు తప్ప మిగతా ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో మద్యం ప్రియులు దుకాణాల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరారు.