ప్రధాని మోదీ సైతం విపక్షాలతో మాట్లాడుతుంటే.. తెలంగాణలో మాత్రం సీఎం ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని ఆక్షేపించారుటీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలంగాణ కంటే చిన్న రాష్ట్రాలు సైతం ఎక్కువ పరీక్షలు చేస్తున్నాయన్నారు.
చనిపోయిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతున్నారని విమర్శించారు. తెలంగాణలో కరోనా టెస్టులు ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. ప్రశ్నించే మీడియాను బెదిరించడం, ప్రతిపక్షం సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవడం లేదని ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాతో చనిపోయిన కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.