ములుగు ఎమ్మెల్యే సీతక్క లాక్ డౌన్ తో తిప్పలు పడుతున్న ములుగు నియోజక వర్గ గూడేలలో ఆదివాసీల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ప్రజల కష్టాలను తీరుస్తూ, కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వారికి నిత్యావసరాలు అందజేస్తున్నారు.
లాక్‌డాన్ అమల్లోకి వచ్చినప్పట్టి నుంచి తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. రాత్రి 10 గంటల వరకు కూడా ఆమె నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నారు. మారుమూల కొండ ప్రాంతాల్లోకి వెళ్లి మరీ పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.
సీతక్క చేస్తున్న సేవలు చూసి.. పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల వారు కూడా… పేదలకు పంచమని.. నిత్యావసర వస్తువులు పంపుతున్నారు. వీటి కోసం.. ఆమె పేదలకు అన్నం పెట్టాలనే చాలెంజ్ కూడా విసిరారు.