ఏపీకి మరో గండం..

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా దెబ్బకు ప్రజలు అల్లాడిపోతుండగా..ఇప్పుడు మరో పిడుగులాంటి వార్త బయటకు వచ్చి వారిలో భయాన్ని నింపుతుంది. రాష్ట్రం వైపు భీకర తుఫాన్ దూసుకవస్తున్నట్లు తెలుస్తుంది. బంగాళాఖాతంలో అండమాన్‌కు దక్షిణ దిశగా ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారబోతోందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఈ నెల 8వ తేదీ నాటికి ఆ అల్పపీడనం మరింత బలపడి తీవ్రమైన తుఫాన్‌గా మారుతుందని అభిప్రాయపడుతోంది. ఎంఫాన్‌ అన్న పేరు పెట్టుకున్న ఈ తుఫాన్.. ఏపీ, ఒడిశా , పశ్చిమ బెంగాల్‌పై భారీ ప్రభావం చూపుతుందని అధికారులు చెబుతున్నారు.

ఈ నెల 13వ తేదీ నాటికి మయన్మార్ వద్ద తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ తుఫాన్ ఎఫెక్ట్‌తో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్ (ఈసీఎండబ్ల్యూఎఫ్‌) చెపుతుంది.