ఐఐటీ హైదరాబాద్ భవనాల నిర్మాణ కార్మికులకు, పోలీసులకు మధ్య సంగారెడ్డి జిల్లా కందిలో ఘర్షణ జరిగింది. తమను స్వగ్రామాలకు పంపాలని వలస కార్మికులు డిమాండ్ చేయడం తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నాలుగు రోజులుగా తమకు భోజనం అందడం లేదని కార్మికులు నిరసనకు దిగారు. రంగంలోకి దిగని పోలీసులు వారికి సర్ది చెప్పబోయారు. వినిపించుకోని కార్మికులు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పోలీసు వాహనం ధ్వంసం చేశారు.
ఈ నిర్మాణ పనుల కోసం వివిధ రాష్ట్రాల నుంచి 1600 మంది కార్మికులు వచ్చారు. లాక్ డౌన్ కారణంగా గత నెలరోజులకు పైగా వారంతా అక్కడే చిక్కుకు పోయారు. యజమాని సంగారెడ్డి కంది ఐఐటీ దగ్గరే కార్మికులను ఉంచారు. గత నెలరోజులుగా ఉపాధి లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో కూలీలు తీవ్ర అసహనానికి గురయ్యారు.